Sunday, March 1, 2015

మేనిఫెస్టో చూసిన ఓటరు ఉహ

ఎంత హాయిలే అలా అని అప్పట్లో తెలుగుదేశానికి వోటు వేయండి అని బాబు గారు చెబితే విని ....
బాబు గారు చేస్తా అన్న హామీలు నమ్మి వోటు వేసిన అమాయకులు ఇలా ఊహించుకున్నారు...
మే 17 ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పక్కనే ఉన్న అన్న కాంటీన్ లో 2 రూపాయలకే అల్పాహారం చేసి పక్క
నే ఉన్న ఆంధ్రా బాంక్ లో అమ్మ పేరు మీద పొలం దున్నడం కోసం పంట రుణాల కింద పెట్టిన బంగారం తీసుకుని ఆ పక్కనే ఉన్న సహాకార బాంకులో నాన్న పట్టాదారు పుస్తకాలు తాకట్టు పెట్టి తెచ్చిన రుణం మాఫీ అయ్యింది అని బాంక్ వారు పుస్తాకాలు ఇచ్చేసిన వాటిన తీసుకుని మధ్యాన్నo హాయిగా మళ్ళీ అన్న కాంటీన్ కి వెళ్ళి 5 రూపాయలతో సుష్టుగా బోజనమ్ చేసి పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీసులో తాత అవ్వ పేరున వచ్చిన 2 వేల పెన్షన్ తీసుకుని, పనిలో పనిగా అతని బార్యామణి పేరు మీద డ్వాక్రా రుణం మాఫీ చేయించుకుని కొత్తది తీసుకుని, వస్తూ వస్తూ దారిలో ఉన్న employment exchange లో నా నిరుద్యోగ బృతి 2వేలు తీసుకుని దారిలో మహిళా శిశు సంక్షేమ అధికారి ఆఫీసులో తన అత్త పేరు మీద ఉన్న వితంతు పెన్షన్ తీసుకుని, ఇంటికి వెళుతూ అన్న కాంటీన్ లో అందరికీ సరిపోను బోజనమ్ 10 రూపాయలతో parcel చేయించుకుని ఇంటికి వెళ్ళి బాబు గారు పంపించిన 32 అంగుళాల LED టి‌వి లో ఉచితంగా ఇచ్చే కేబుల్ ప్రసారాలు చూస్తూ.... గడిపెద్దామ్ అనుకున్నారు....
ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చారోతెలిసి ఆయనని ఏమీ అనలేక కులాభిమానంతో మోడీ ని తిడుతున్నారు,, ఆనాడు ఆ మోడీ తో పొత్తుకోసం ఎంత పాకులాదారో చేపల్సిన పని లేదు....మోడీ లేకపోతే ఈనాడు మీ బాబు గారు పదవిలో ఉండేవారా ??? యేరు దాటాక తెప్ప తగలేసే రకం మీరు అయితే... తాడిని తన్నే వాడు మోడీ... ఎంత మాట అన్నారు?? మోడీ హైదారాబాద్ వస్తే అరస్ట్ చేస్తారా ?? అహంబావి అయిన మోడీ మిమ్మల్ని ఎదగనిస్తాడా ?? మీకు మీ బినామీల యాపారం కోసం సహకరిస్తాడా?? అసలు సుజనా గారికి మంత్రి పదవి ఎలా తెచ్చుకున్నారో తెలుసుకోండి...

No comments:

Post a Comment